బిగ్ బాస్ ఆట మొదలైపోయింది. “ఓర్నాయనో మళ్ళీ వచ్చసిందా? పనికి మాలిన గోల” అని తిట్టుకుంటూనే ఉంటారు. కానీ, ఆ వెంటనే హౌస్‌లోకి ఎవరెవరు వచ్చార్రా అని కుతూహలంగా చూస్తూ ఉంటారు. “ఆ నాగార్జున దానికి భలే గడ్డిపెట్టాడ్రా” అని పొగిడుతారు, కానీ అదే సమయంలో “నేనైతే రెండు పీకేవాడ్ని” అని కూడా అంటారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 8
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 01 ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ మా ఛానల్‌లో ప్రారంభమైంది. మూడో సీజన్ నుండి వరుసగా హోస్ట్ చేస్తున్న నాగార్జునే ఈ సీజన్‌కీ హోస్ట్‌గా కొనసాగుతున్నారు.
ఈ సీజన్‌లో కొత్త ట్విస్ట్‌లు
గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ ఆటలో కొన్ని మార్పులు జరిగాయి. ప్రతి సీజన్‌లోనూ ఒక్కో కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపేవారు. కానీ ఈ సీజన్‌లో జంటలుగా కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపిస్తున్నారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌ని ఏడు జంటలుగా హౌస్‌లోకి పంపించారు.
బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం
ఈ సీజన్ ప్రారంభం ఎప్పటిలాగే ప్రత్యేకంగానే జరిగింది. నాగార్జున ‘బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ’ థీమ్ మ్యూజిక్‌తో ప్రారంభించారు. ఆ తరువాత దేవర సాంగ్‌కి స్టెప్పులు వేశారు. హౌస్‌లోకి వెళ్లిన నాగార్జున, ప్రకృతికి దగ్గరగా ఉండేలా రూపొందించిన హౌస్‌ని చూపించారు.
ఇన్ఫినిటీ రూం: ప్రత్యేక ఆకర్షణ
ఈ సీజన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ ఇన్ఫినిటీ రూం. నాగార్జున ఈ రూమ్‌ని ప్రదర్శించకపోయినా, ఇది ఆటలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. తరువాత తూనీగ, నెమలి, జీబ్రా అనే మూడు డిఫరెంట్ బెడ్ రూంలను చూపించారు.
ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ
ఫస్ట్ కంటెస్టెంట్‌గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ నటి యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఒకొక్కర్నీ కాకుండా, జంటగా పంపించటం మొదలుపెట్టారు. యష్మీ గౌడ, నిఖిల్ ఇద్దర్నీ కలిపి హౌస్‌లోకి పంపారు.
మిగతా కంటెస్టెంట్స్
మూడో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్‌గా ప్రేరణ కంభం ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరినీ రెండో జంటగా హౌస్‌లోకి పంపించారు. 35 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రానా, నివేదా థామస్ హౌస్‌లోని రెండు జంటలతో ఫన్నీ టాస్క్ ఆడించారు.
బిగ్ బాస్ సీజన్ 8లో కీలక ట్విస్ట్‌లు
నాగార్జున ఈ సీజన్‌లో పెద్ద ట్విస్ట్‌ని రివీల్ చేశారు. ఈ సీజన్‌కి కెప్టెన్ ఉండడని, ఎవరికి ఇమ్యునిటీ కూడా ఉండదని చెప్పారు. ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్‌గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరినీ మూడో జంటగా హౌస్‌లోకి పంపించారు.
ఇతర కంటెస్టెంట్స్ ఎంట్రీలు
ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. ఎనిమిదో కంటెస్టెంట్‌గా శేఖర్ బాషా హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిద్దరినీ నాలుగో జంటగా హౌస్‌లోకి పంపించారు. శేఖర్ బాషాపై పాటపాడిన బేబక్క, నాగార్జునను అడిగి హగ్ కూడా ఇప్పించుకుంది.
సీజన్ 8లో మరిన్ని ట్విస్ట్‌లు
9వ కంటెస్టెంట్‌గా కిర్రాక్ సీత, 10వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరినీ ఐదో జంటగా హౌస్‌లోకి పంపించారు. మరికొన్ని కీలక ట్విస్టులు రివీల్ చేస్తూ, బిగ్ బాస్ ఆహారాన్ని కూడా గెలుచుకోవాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్‌దేనని నాగార్జున తెలిపారు.
హౌస్‌లోకి చేరిన మిగతా కంటెస్టెంట్స్
11వ కంటెస్టెంట్‌గా ‘నాగ పంచమి’ సీరియల్ హీరో పృథ్వీ, 12వ కంటెస్టెంట్‌గా యాంకర్ విష్ణు ప్రియ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరినీ ఆరో జంటగా హౌస్‌లోకి పంపించారు. 13వ కంటెస్టెంట్‌గా ఢీ డాన్సర్ నైనిక, 14వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ అఫ్రిది ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరినీ ఏడో జంటగా హౌస్‌లోకి పంపించారు.
హౌస్‌కి తాళం వేసి.. గుడ్ నైట్
తొలిరోజే ఎలిమినేషన్ అంటూ మణికంఠని డోర్ వరకూ తీసుకెళ్లి టెన్షన్ పెట్టించారు. ముగింపులో మూడు బ్యాడ్ న్యూస్‌లు చెప్పారు. కెప్టెన్ ఉండడని, రేషన్ ఉండదని, ప్రైజ్ మనీ కూడా ఉండదని ప్రకటించారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌కు భారీ ఆహార సంచయాలు, లిమిటెడ్ రేషన్‌లు, మరియు టాస్క్‌లు గెలిచే బాధ్యత ఉంటుందని చెప్పారు.
బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ జాబితా
- యష్మీ గౌడ
- నిఖిల్ మల్యక్కల్
- అభయ్ నవీన్
- ప్రేరణ కంభం
- ఆదిత్య ఓం
- సోనియా ఆకుల
- శేఖర్ బాషా
- కిర్రాక్ సీత
- నాగ మణికంఠ
- విష్ణు ప్రియ
- పృథ్వి రాజ్
- బెజవాడ బేబక్క
- నైనిక
- నబీల్ అఫ్రిది
Bigg Boss 8 Telugu Voting - Vote for Your Favourite Contestant
Live
Bigg Boss 8 Telugu Vote (Week 2)
-
Vishnu Priya
25%
114/ 443
-
ManiKanta
11%
53/ 443
-
Shekar Basha
11%
49/ 443
-
Prithviraj
6%
28/ 443
-
Nikhil
19%
88/ 443
-
Seetha
9%
44/ 443
-
Nainika
6%
28/ 443
-
Aditya Om
9%
40/ 443